His Holiness Sri Sri Ganapathi Sachchidananda Swamiji of Mysore, one of the greatest spiritual leaders of the present day is an asset to India and the world at large. He is an incarnation of the Great Cosmic Power. Revival of culture, reformation of society and establishing peace and happiness among mankind and transforming into godly men is his mission. His methods include: establishing Dharma.* and Bhakti.* by singing devotional hymns, by reciting the names of the Lord Almighty and inculcating the masses by instilling into them love of God through chorus singing of Bhajans and listening to his meditation-music.To experience Him is to begin to know one's own true self. ##Avadootha Datta Peetham Mysore Contact NO:91-821-2486486, 91-821-2480424 ##Fax No:91-821-2487487 ##Email Address:mail@dattapeetham.com ##Address:Avadhoota Datta Peetham, Sri Ganapati Sachchidananda Ashrama, Dattanagar,Ooty Road, Mysore 570 025 India

Sunday, January 1, 2012

I would like to Wish you all Happy New Year by sharing my Wonderful Experience with our Holy Master.


సద్గురుని లీలలు విన్న, వ్రాసిన, చదివిన, చెప్పిన అది తప్పక మన జీవితపు విలువలకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి  ఎంతగానో తోడ్పడుతుంది గురుని కృపతో చేసిన చిన్న ప్రయత్నం ఇలా మీ ముందు ఉంచుతున్నాను.
 
ఉద్యోగరీత్యా గుంటూరులో ఉంటున్న రోజులవి రోజు 28.06.2010 సరిగ్గా 1:51:42 ని!! లకు నిద్ర నుండి ఒక్కసారిగా మెలకువ వచ్చిందిపూజ్య అప్పాజీ కలలో దర్శనం ఇచ్చి సుమారు ౩౦ నిమిషాలు ఇంగ్లీష్ లో నాతో మాట్లాడారు అని తెలిసిందికాని ఏమి మాట్లాడారు అని ఎంతగా ఆలోచించినా రెండు వాక్యాలు మాత్రమే గుర్తుకువస్తున్నాయి.

అవి కూడా ఇంగ్లీష్ లోనే.

" Complete the SAP Certification First. You should be Happy "
" ఎస్..పి పరిక్ష వ్రాయమని , నేను సంతోషంగా ఉండాలి అని " 

వెంటనే హాల్ లో వున్న స్వామివారి పూజా మంటపం ముందు కూర్చొని ఆయనను చూస్తూ ఇంకా గుర్తుకుతెచ్చుకునే  ప్రయత్నం చేసానుమళ్లీ అవే వాక్యాలు స్ఫురణకు వస్తున్నాయి తప్పితే వేరే ఏమీ తెలియటం లేదుఅయితే ఆయన నాకు ఇవ్వతలచిన  సందేశం అది మాత్రమే అని తలచి వెళ్లి పడుకున్నాను.
 
చేస్తున్న ఉద్యోగం నా స్వభావానికి , పద్ధతులకు సంబంధంలేక నిరంతరం భాదపడుతూ ఉండేవాణ్ణిఆయనను స్మరిస్తూ అందుకు కావాల్సిన శక్తిని ఇవ్వమని వేడుకొంటు నా పనిని నేను చేస్తువున్నా, ఒకోసారి తీవ్రమైన మనస్తాపానికి గురికావల్సి వచ్చేది. అలా ఒక రోజు ఉద్యోగాన్ని విడవాలని నిర్ణయించుకొని ఎప్పటినుండో  మనసులో వున్నా ఆలోచనకు పదునుపెడుతూ వచ్చానుఅదే SAP లో కెరీర్ మొదలుపెట్టాలి అనిసరిగ్గా దీనికి మార్గాన్ని చూపించారు శ్రీ స్వామిజీ నా కలలోసద్గురుని మాటలను , సందేశాలను అర్థం చేసుకోవటం చాల కష్టం, ఒకవేళ అర్థం అయ్యిన, అందుకు అనుగుణంగా నడుచుకోవటం చాల ముఖ్యం.
 
దత్తుని మీద భారం వేసి ఉద్యోగానికి సెలవు చెప్పానుమన స్వామి ఎంతటి కరుణామయుడో మనకు తెలుసుఇలా జరిగిన చాలా కొన్ని రోజులకు నా భార్యకు చెన్నైలో మంచి ఉద్యోగం వచ్చిందిఅందుకు మేము చెన్నైకి వెళ్ళాముస్వామిజీ కలలో నన్ను SAP Certification చెయ్యమన్నారు, కానీ అదేమో చాలా ఖర్చుతో కూడుకున్న పనినాకు మించినదీ అని తలచి, చిన్న దానిలో అదే కోర్సుకి ట్రైనింగ్కి జాయిన్ అయ్యానుఅది పూర్తిచేసుకొని ఉద్యోగాలకు ప్రయత్నం మొదలపెట్టాను, కాని నాకు తగిన ఉద్యోగ అవకాశం ఒక్కటికూడా దొరకలేదుఏమి చెయ్యలా అని ఆలోచిస్తే, బెంగుళూరులో జాబు మార్కెట్ బాగుంటుంది అని అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే జాబు తప్పక వస్తుంది అని బెంగుళూరు  వెళ్ళాను. అక్కడి ట్రైనింగ్ పూర్తియ్యిన తరువాత నిదానంగా చిన్న చిన్న జాబ్స్ కి మార్గం దొరకటం మొదలయ్యింది.
 
బెంగుళూరు ఆంజనేయస్వామి మహిమ మన అందరికి సుపరిచితమే కదాఒక జాబు ఇంటర్వ్యూకి వెళ్తూ స్వామికి జాబు తప్పక వచ్చేట్లు దీవించు అని పూర్ణ ఫలం కట్టాను. ఇదివరకు ఎప్పుడు కోరిక వున్నా, ఏమి కష్టమొచ్చిన , నాకు ఏది అయితే అవసరమో నీకు మాత్రమే తెలుసు స్వామిఅది మాత్రమే నాకు ఇవ్వు, అని వేడుకునేవాడినికాని సారి ఉద్యోగం ఇవ్వు అని ఖచ్చితంగ అడిగేశానుమొదటి రౌండ్, రెండో రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యాను. ఎందుకో అనుమానం వచ్చి స్వామి దెగ్గరకు వెళ్లి, మనస్తాపంలో అలా కోరాను కాని స్వామి, నీ ఇష్ట ప్రకారం జరగని అందుకు నేను నడుచుకునే శక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకున్నానుమూడవ రౌండ్ లో ఉద్యోగం చెయ్యిదాటిపోయిందిఅలానే చెన్నైకి తిరిగి వచ్చేసానుకొన్ని ఇంటర్వ్యూలు  అటెండ్ అయ్యాను కాని ఫలితం లేదు.
 
ఇలావుండగా ఒక రోజు చిన్న కంపెనీ లో నేను కోరుకున్న దానిలోనే చిన్న ఆఫర్ వచ్చింది . వెంటనే  పూజ్య బాల స్వామీజీ  వారికి జాబు గురించి  మెయిల్ ద్వారా విన్నవించుకున్నానుసరిగ్గా 05.04.2011 ఆయన నన్ను ఉద్యోగం వద్దని  sap certification చెయ్యమని చెప్పారు.

"
కలలో అప్పాజీ వారు చెప్పినదే - ఇలలో బాలస్వామిజి వారు చెప్పారు "
 అప్పటి ఆయన మాటకు నా పరిస్థితులను చేర్చి , నన్ను నేను సర్ది చెప్పుకున్నాను, కాని రోజు మళ్లీ అదే సూచన వచ్చిందిఈసారి ఏమైనా సరే ఆయన మాట తప్పరాదు అని తలిచి , అందుకు కావాల్సిన డబ్బును ఏర్పరచుకునే ప్రయాత్నంలోపడ్డాను. చివరకు ఆయన దయతో మే 26 Siemens లో, SAP Certification Exam కి ట్రైనింగ్ కోసం చేరాను. ఆగస్టు 26 తల్లి జయలక్ష్మి మాత దయవలన పరీక్ష పాస్ అయ్యాను.
 
సరిగ్గా నేను పరీక్ష పూర్తిచేసుకొని వచ్చేసరికి ప్రపంచ ఆర్ధిక పరిస్థితి బాగుండక ఉద్యోగాలు దొరకటం కొంచెం కష్టంగా వున్నదిఅవన్నీ మనసులో పెట్టక చెన్నైలో ఆంజనేయస్వామికి పూర్ణ ఫలం కట్టి , శత శ్లోకి రామాయణం చూస్తూ 40 రోజుల దీక్ష పూర్తిచేసుకున్నాను. మరుసటి రోజునే యష్ టెక్నాలజీస్ అనే కంపెనీ నుండి ఇంటర్వ్యూ కోసం ఫోన్ వచ్చింది. మళ్లీ కొన్ని రోజులలో చేస్తాము అని చెప్పారు.
 
అక్టోబర్ 13.10.2011 ఉదయం 5:00 గం !! లకు మా అమ్మగారు నన్ను గట్టిగ పిలుస్తువున్నట్లు తెలిసి నిద్రనుండి లేచి కింద రూంకి నడిచానుఆమె పిలవటం లేదు, నిజంగా అరుస్తుందేమో అనిపించిందిఇంతకూ ఏమిటి విషయం అంటే , ఆమె ఆనందంలో అల అరుస్తూ వుంది, అప్పాజీ వారు తనకు ఉదయాన్నే కలలో దర్శనం ఇచ్చారట.
 
నా ఉద్యోగం గురించి అమ్మ అడిగితె,

"
ఎందుకు కంగారు పడతావ్? వాడికి రెండు రోజులలో ఉద్యోగం వస్తుంది ., వాడి మొదటి నెల జీతాన్ని తెచ్చి స్వామికి సమర్పించమను " అని చెప్పారట.
 
ఇది వినగానే ఆనందము, ఆశ్చర్యము కలిగాయినిజానికి, నాకు ఒక కంపెనీ నుండి ఫోన్ వచ్చిందని, మళ్లీ వారు ఇంటర్వ్యూకి ఫోన్ చేస్తారని మా అమ్మకు తెలియదువెంటనే ఇద్దరం కలసి ఆశ్రమముకి వెళ్లి పవమాన హోమంలో పాల్గొన్నాము.
 
స్వామీజీ కలలో చెప్పారుకదా ...రెండు రోజులని - అదే రోజున మద్యాన్నం ఇంటర్వ్యూ అయ్యింది, సాయంత్రానికి నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పారు ., మరుసటి రోజుకి కంపెనీ నుండి అపాయింట్మెంట్  లెటర్ కూడా వచ్చేసింది

 సద్గురుని మహిమ గురించి చదివాము, విన్నాము, ఆయన కృపవలన మా జీవితాలలో మాధుర్యాన్ని చూశాము కూడాఅయిన ఆయనతో పయనం నిత్య నూతనంఎప్పుడు అది కొత్తగా, మొదటి అనుభవం లాగా వుంటుంది.
 
సరిగ్గా అదే సమయానికి పూజ్య బాలస్వామీజీ వారు తిరుపతి వస్తున్నారని తెలిసిందివెంటనే 14.10.2011 వెళ్లి ఆయనకు వార్తను తెలిపి, ఆయన అనుమతితో ఆక్టోబర్ 31  ఉద్యోగం లో చేరాను.
 
సంవత్సరము క్రితం కలలో చెప్పిన మాటను విని నడుచుకొని వుంటే వెంటనే ఉద్యోగం దొరికేదేమో, కాని ధైర్యం చాలలేదు, శక్తి సరిపోలేదు, కాని ప్రతిదానికి నిగూడార్థం వుంటుంది అన్నట్లు, ఆయన దయతో అంతా మంచే జరిగింది.

10.12.2011
దత్త జయంతి పండుగనాడు, సద్గురునికి కొత్త ఉద్యోగపు మొదటి నెల జీతమును సమర్పణ చేసేటి భాగ్యం కలిగింది. మూల విరాట్ దత్త స్వామికి  తైలాభిషేకమును చేస్తూ మన కుల దైవమైన దత్త గురుని దర్శనం, ఆయన చూపు, అమృత తుల్యమైన నవ్వు నా జీవితంలో ప్రతి క్షణం గుర్తుకు వచ్చేంత బాగా ముద్రవేసుకున్నదిఇది స్వామి కృప
 
నా అనుభవం లో వున్న నీతిని, సద్గురుదేవుడు నా బుద్ధికి విధంగా తెలియచేసారు.
 
ఒకటి:: సద్గురుని నోటివెంట వచ్చే ప్రతి పలుకు అమృతమే. నమ్మిన వారికి తగుసమయానికి కావాల్సిన సూచన, రక్షణ ఆయన అందిస్తూనే ఉన్నారుకాని మన అజ్ఞానంతో, దానిలోని నిగూడ అర్థాన్ని అర్థంచేసుకోలేక మన జీవన ప్రయాణంలో కొంచెం వెనకపడుతూ వున్నాముఆయన మాటకు అనుగుణంగా నడిచే శక్తిని అందుకు కావాల్సిన సాధనను స్వామిని  మనకు అందించమని నిరంతరం వేడుకుందాంఇందుకు నిరంతర సజ్జన సాంగత్యం ఎంతో తోడ్పడుతుంది.
 
రెండు: మన ప్రియతమ ఆంజనేయ స్వామివారి మహిమ.
నాకు ఇది కావాలి స్వామి అని కాక  నాకు ఏది అవసరమో అది ఇవ్వు స్వామి అంటే , చాలా త్వరగా సంకల్పాలు సిద్ధిస్తాయి అని తెలుస్తువుంది. ఇందులో ఎటువంటి షరతులు లేవు, కేవలం స్వేచ్చ మాత్రమే వున్నది.
 
మూడు: పూజ్య అప్పాజీ వారికి మరియు పూజ్య బాలస్వామిజీ వారికి ఎటువంటి బేధము లేదు అని కుడా అనుభవానికివస్తోంది. ఇందుకు నాకు మరో సంగటన గుర్తుకు వస్తోందిమా ఇంటిపక్కన వుండే కుటుంబం , నిరంతరం మా ఇంట్లో జరిగే స్వామి భజనలకు ఆకర్షితులు అయ్యి వారి బాబుకి స్వామీజీ చేత  నామకరణం చేయించాలి అని ఉగాదికి మాతో దుండిగల్  ఆశ్రమానికి వచ్చారుఅయితే అప్పాజీ వారు రోజు చాలా బిజీ గా వుంటారు అని తెలిసి, మా సూచన మేరకు పూజ్య బాలస్వామీజీ వారిచే వారి బాబుకు నామకరణం చేయించారుపూజ్య బాలస్వామీజీ బాబుకు " కుమారదత్త " అని పేరు పెట్టారుఅయితే వారికి మనసులో అప్పాజీ వారితో అవ్వలేదే అని వున్నదిఇంతలో పూజ్య అప్పాజీ వారు బయటకు వచ్చి భక్తులకు ప్రసాదాలు ఇస్తువున్నారు దంపతులు మళ్లీ అప్పాజీవారి దగ్గరకు వెళ్లి తమ బాబుకు నామకరణం చెయ్యండి అని అడుగగా., ఆయన కుడా "కుమారదత్త" అని చేసారుఇది ఎంతో అద్భుతమైన విషయం.
 
అందుకే హృదయం ఎప్పుడు మన సద్గురుదేవులను విధంగా కీర్తించటానికి
ఇష్టపడుతుంది ....

"
శివుడె సాక్షాత్తుగ ఈశ్వరుడె శివగురువుగ
ఇల వెలసె శ్రీ గణపతి సచ్చిదానందుడై
స్కందుడె సాక్షాత్తుగ కుమారుడె గురుగుహునిగ
మది మురిసె శ్రీ దత్త విజయానందుడై"
 
సద్గురుని మహిమలు ఇన్ని అని చెప్పలేము, అది సముద్రములోని ఇసుకరేణువులను లెక్కించే ప్రయత్నం వంటిది.
 
కాని అమృతమూర్తి యొక్క లీలలను , గుణగణాలను కీర్తించటం మన భాగ్యం, సౌభాగ్యం -మెయిల్ చదివే ప్రతి వారి జీవితములో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగాయి, మరి ఎన్నో మహిమలు చోటుచేసుకున్నాయి, వాటిలో కొన్నిటినైనా అక్షరములలో  వుంచగలిగితే నాలాంటి వారు ఎంతో మంది ధన్యులు కాగలరుఅందుకు సద్గురుమూర్తి మన అందరిపైనా ఆయన దివ్య ఆశీస్సులను వర్షించనీ అంటూ ...
 
అదిగో మనంకూడా దత్త సద్గురుని నావలో సంసార సాగరాన్ని దాటే ప్రయత్నం చేద్దాందివ్య నామాన్ని పలుకుతూ ఆలస్యము చెయ్యక, మరో ఆలోచనకు చోటివ్వక, నిర్మలమైన హృదయముతో, ధృడమైన సంకల్పముతో ఇలా...........



                                                                  .......By........
                                                                  Pavan Kumar Gollamudi


2 comments: