మనసను అద్దము శుచి గావించి
రఘుపతి చరితము గానము చేయుచు
నాలుగు విధముల ఫలములనందుము
హనుమను విడువక తలచిన భక్తిగ
బుద్ధిహీనతయు తొలగును నిజముగ
బుద్ధిని బలమును విద్యనొసంగును
వికారదూరుడు ఆంజనేయుడు
జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ మము కావర దేవర ....1
రామదూత అతులిత బలవంతా
హనుమా నీవే మా బలమంతా
మహావీర విక్రమ భుజశాలీ
కుమతిని చెరుపుట నీకది కేళీ
బంగరు వన్నెతొ వెలిగెడి దేవా
గురువై మమ్మిక కావగ రావా
చేతను దాల్చిన వజ్రాదులతొ
విరాజమానుడ! హే ఉపవీతి
శంకర అంశజ! కేసరి నందన!
తేజోరాశీ అంజని చందన!
విద్యా వారిధి బహుగుణచతురా!
కార్యసిద్ధికర కపివర వీరా!
భక్తితొ రాముని కథలను వింటివి
హృది సీతాపతి వున్నాడంటివి
సూక్ష్మరూపమున సీతను పోల్చి
తీక్ష్ణరూపమున లంకను కాల్చి
భీమరూపమున అసురుల కూల్చి
రామకార్యమును చేస్తివి గెల్చి
హే సంజీవన లక్ష్మణ జీవన!
రామాలింగన పులకితభావన!
రఘుపతి కీరితి పెంచితివయ్యా
స్వామికి భరత సమానుడవయ్యా
వేయిపడగల ఫణి కీర్తించెను
అని నిను రాముడు కౌగిట ముంచెను ....13
సనకాదులు బ్రహ్మాది సుధాదులు
నారద తుంబురు శారదాదులు
ఇంద్ర యమాదులు దిక్పదయుక్తులు
కవులందరు నిను పొగడ అశక్తులు
సుగ్రీవుడు నీ మేలును పొంది
రాముని కలిసె రాజ్యము నందె
అభయమునంది విభీషణుడేలె
ఆ లంకేశుడు భయమున తూలె
భానుని ఫలమని తలిచి గ్రహించి
హనుమన్నాముడవైతివి దేవా
ప్రభుముద్రికను మోమున దాల్చి
జలధిని దాటగ అచ్చెరువేమి?
జగమున దుర్గమ కార్యములన్నియు
సుగమము లాయెను నీకృపతోడను
రాముని ద్వారము నందున ఉందువు
నీయానతితో కదలును లోకము
నిను శరణనగా కలుగును సుఖములు
నీ రక్షణలో తొలగును భయములు ....22
నీ తేజోభర హుంకారమున
కంపనమొందెను త్రిజగతి భయమున ....23
భూత ప్రేత పిశాచములన్నియు
నీనామంబును పలికిన విడచును
రోగవినాశము పీడాహరణము
చేయును హనుమా! నీదగు మంత్రము ....25
సంకటముల నువు విడిపించెదవు
ధ్యానము నందున మది గుడి నుందువు ....26
రాముడె గమ్యము మునికులమునకు
నీవే గమ్యము మాకందరకు
నిను సేవించిన కోర్కెలు తీరును
ముక్తి పదంబది జీవులకందును
నీదు ప్రతాపము నాలుగు యుగముల
సిద్ధిని పంచును కీర్తిని పెంచును
సాధు రక్షక! దుష్ట శిక్షక!
అసురనాశక! రామ సేవక!
అష్టసిద్ధి నవనిధులను ఒసగే
హనుమడు సీతా కృపతో వెలిగె
రామ రసాయనమున్నది నీదరి
నువు కొలువుండుము హనుమా! మాదరి ....32
నిను భజియించిన రాముడు దొరకును
శతశత జన్మల పాపము తొలగును ....33
రాముని కొలిచిన అవసానమున
భక్తుడు వెలుగును హరిధామమున
మనసున హనుమను నిలిపిన సుఖము
మరు జన్మములిక కలుగవు నిక్కము ....35
నీస్మరణముచే కష్టము తీరును
ఓ బలవీరా! పీడలు తొలగును
జైజైజై హనుమాన గోసాయీ
సద్గురురూపా! బహుఫలదాయీ!
ఈ స్తోత్రంబును శతపర్యాయము
చదివిన మోక్షము శివుడే సాక్ష్యము
కవి వాల్మీకియు, తులసీదాసులు
హనుమను దలచిరి ముక్తిని పొందిరి ....39
ఇది తెనుగించెను సచిదానందుడు
దీనిని చదివిన సచిదానందము
పవనతనయ సంకట హరణ
మంగళ మారుతి రూప
సీతారాముల హృదయము నందున నిలిపిన వానర సురభూప
No comments:
Post a Comment